సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : కెసిఆర్ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ని చూసి ఓటు వేయాలని, బీఆర్ఎస్ ప్రభుత్వం లో షాద్ నగర్ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, బీఆర్ఎస్ ఎమ్మేల్యే అభ్యర్థి అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అంజయ్య యాదవ్ ఎలాంటి అంగులు, ఆర్భాటాలు లేకుండా సదా, సిదగా స్థానిక ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. దేశంలోనే ఎ రాష్ట్రంలో జరుగని అభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వం లో కెసిఆర్ సారధ్యంలో తెలంగాణ లో జరిగిందన్నారు. కేసీఆర్ నాయకత్వలో ఎన్నో సంక్షేమ పథకాలు చెప్పటి పేద ప్రజలకు మేలు జరిగేలా చేశారన్నారు, రైతు బంధు, రైతు భీమా, 24 గంటల కరెంటు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్టు, పిన్షన్స్ ఇలా ఎన్నో పథకాలు చేపట్టిన ఏకైక నాయకుడు కేసీఆర్ అన్నారు. తెలంగాణ రాకముందు ఎలా ఉండే తెలంగాణ వచ్చాక ఎలా అభివృద్ధి చెందిందో ప్రజలు గమనించాలని కోరారు. కేసీఆర్, కేటీఆర్ సహకారంతో షాద్ నగర్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశానన్నారు. అభివృద్ధి ని చూసి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. తనను ప్రజలు ఆశర్వదించి మరో సారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నవీన్ రెడ్డి, కడెంపల్లి శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, బీఆర్ఎస్ పార్టీ ఫరూఖ్ నగర్ మండల అధ్యక్షుడు లక్ష్మణ్, కౌన్సిలర్లు, ఎంపీపీలు, ఎంపిటిసిలు, సర్పంచులు, బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
-----------------------
Admin