Monday, 14 September 2026 07:09:44 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇళ్ల నిర్మాణం వేగవంతంగా చేపట్టాలి... -జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్

Date : 05 February 2023 02:14 AM Views : 679

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పెనుకొండ పట్టణo పరిధిలోని జగనన్న హౌసింగ్ లేఔట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్, వేగవంతంగా ఇళ్ల నిర్మాణం చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి.బసంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. పెనుకొండ పట్టణ పరిధిలోని జగనన్న హౌసింగ్ లేఔట్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నవరత్నాలు - పేదలందరికీ ఇళ్లు కింద జగనన్న హౌసింగ్ లేఔట్లలో చేపట్టిన ఇళ్ల నిర్మాణం ఊపందుకోవాలన్నారు. పెనుకొండ పరిధిలో జగనన్న హౌసింగ్ లేఔట్లలో 1,915 ఇళ్లు మంజూరుకాగా, బిలో బేస్మెంట్ స్థాయిలో 296 ఇళ్లు, బేస్మెంట్ స్థాయిలో 658, ఆర్ఎల్ స్థాయిలో 220, ఆర్సీ స్థాయిలో 334 ఇళ్లు నిర్మాణంలో ఉండగా, మరో 400 ఇళ్లు నిర్మాణం పూర్తి కావడం జరిగిందన్నారు. ఇళ్ల నిర్మాణం వేగవంతం చేయాలని, బిలో బేస్మెంట్ స్థాయిలో ఉన్నవాటిని బేస్మెంట్ స్థాయికి, బేస్మెంట్ స్థాయిలో ఉన్నవాటిని ఆర్ఎల్ స్థాయికి, ఆర్ఎల్ స్థాయిలో ఉన్న ఇళ్లను ఆర్సీ స్థాయికి తీసుకురావాలని, ఆర్సీ స్థాయిలో ఉన్న ఇళ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఇళ్లు నిర్మాణంల్లో ఎలాంటి అలసత్వం ఉండరాదని, అలసత్వం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ చంద్రశేఖర్, డిఈ శంకర్ లాల్, ఏఈ శ్రీనాథ్, ఎంపిడిఓ శివ శంకరప్ప, తహసీల్దార్ స్వర్ణలత, మున్సిపల్ కమిషనర్ వంశీ, ఇంజనీరింగ్ అసిస్టెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: