Tuesday, 15 September 2026 08:44:36 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రతి టీడీపీ కార్యకర్త వీర సైనికుల్లా పనిచేయాలి... -మాజీమంత్రి పల్లె

Date : 13 June 2023 12:30 AM Views : 578

సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం నారా చంద్రబాబు నాయుడు తోనే ఏపీకి ఉజ్వల భవిష్యత్ ఉంటుందని మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి అన్నారు.ఓబుల దేవర చెరువు మండల కేంద్రంలోని స్థానిక ఐటీఐలో సోమవారం నిర్వహించిన బూత్ ఇంఛార్జిలు, క్లస్టర్ ఇంఛార్జిలు, మండల పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి తో పాటు నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు బచ్చల ఫుల్లయ్య తో కలసి ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికలు మనకు ఎంతో కీలకం అన్నారు. రాష్ట్రంలో సైకో పాలనతో ప్రజలు విసిగిపోయారని, త్వరగా ఏపీలో టీడీపి రావాలని మెజార్టీ జనం కోరుకొంటున్నారని ఆయన తెలిపారు. 2024 ఎన్నికలు టీడీపీ, వైసీపీ కి సెమీపైనల్స్ అని ఆ ఎన్నికల్లో ప్రజలే జగన్ కు సమాధి కడతారని పేర్కొన్నారు.ఆయా గ్రామ పంచాయతీ ల్లో బూత్ ఇంఛార్జ్లు, క్లస్టర్ ఇంఛార్జ్లు లు ఎంతో కీలకం అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి కార్యకర్త వీర సైనికుడిలా పని చేస్తేనే టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రన్న ముఖ్యమంత్రి కావడం ఈ రాష్ట్ర ప్రజల సాకారం,ఆకాంక్ష నెరవేరుతుందన్నారు. గ్రామాల్లో వంద మందికి ఇద్దరు క్లస్టర్ ఇంఛార్జ్లు ఉండేలా చర్యను వేగవంతం చేయాలని ఆయా మండల టీడీపీ కన్వీనర్లు ,క్లస్టర్ ఇంచార్జ్ లకు సూచించారు. ఈ సమావేశంలో పుట్టపర్తి మైనార్టీ ప్రధాన కార్యదర్శి పొగాకు షబ్బీర్,టీడీపీ మండల కన్వీనర్ జయచంద్ర,మాజీ జెడ్పిటిసి పిట్టా ఓబులరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పిట్ల సుధాకర్, రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి జెరిపిటి అంజన్నప్ప,తెలుగు రైతు హిందూపురం పార్లమెంటరీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జాకీర్ అహ్మద్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి బడిసం రామాంజనేయులు, హిందూపురం పార్లమెంటరీ తెలుగు యువత, కార్యదర్శి జయచంద్ర రెడ్డి మండల తెలుగు యువత అధ్యక్షుడు కొండే ఈశ్వరయ్య, ఓ డి సి మండల మాజీ కన్వీనర్ రాజారెడ్డి, కన్వీనర్ రామానాయుడు, మాజీ ఉపసర్పంచ్ సాదిక్వలి, నియోజకవర్గ మైనార్టీ సెల్ కార్యదర్శి ఇర్షాద్, ఓ డి సి గ్రామ మైనార్టీ అధ్యక్షుడు షాను, మాజీ డీలర్ చిన్న రాయుడు,సంగాల శ్రీనివాసులు, మాజీ వార్డ్ మెంబర్ కేశవ, గండికోట ఇమ్రాన్, మల్లోళ్ళపల్లి రాజారెడ్డి, లక్ష్మీరాం నాయక్, డ్రైవర్ అబ్లూ, సాయి, టీడీపీ మండల నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :