Monday, 14 September 2026 06:10:51 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

టిఎంజెఎఫ్ రాష్ట్ర ప్రథమ మహాసభలను జయప్రదం చేయాలి....

Date : 17 August 2024 12:09 PM Views : 354

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో ఆగస్టు 21 న జరిగే తెలంగాణ మాదిగ ,మాదిగ ఉప కులాల జర్నలిస్ట్ ఫోరం (టీఎంజేఎఫ్) రాష్ట్ర ప్రథమ మహాసభను విజయవంతం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షులు సోమన్న మాదిగ అన్నారు. కరపత్రాలు ఆవిష్కరణకు విచ్చేసి హుజూర్ నగర్ మండల కేంద్రంలో కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నిత్యం సమస్యల వలయంలో చిక్కుకొని మెరుగైన సమాజం కోసం వార్తల రాస్తూనే ఉండేవారు జర్నలిస్టులని, అలాంటి జర్నలిస్టులపై దాడులు, బెదిరింపులు జరుగుతున్నాయని, అందులో దళిత జర్నలిస్టులపై ఎక్కువగా జరుగుతున్నాయని, గత ప్రభుత్వం జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని, సమాజంలో ఇప్పటికీ దళిత జర్నలిస్టుల పట్ల వివక్షత కొనసాగుతోందని, రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది జర్నలిస్టులపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం స్పందించి జర్నలిస్టులందరికీ ఇంటి స్థలం కేటాయించడంతోపాటు చిన్న పత్రికలు అనే తారతమ్యం లేకుండా జర్నలిస్టు అనే ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. ఇట్టి మహాసభకు ముఖ్యఅతిథిగా సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి, మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దనసరి సీతక్క ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తో పాటు మాదిగ ఉద్యమ రథసారథులు ముఖ్యులు హాజరవుతున్నారని మాదిగ, మాదిగ ఉపకులాల జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో దళిత జర్నలిస్టులు టిఎంజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వస్కుల రామయ్య జిల్లా కార్యదర్శిలు మీసాల నాగయ్య రాం సైదులు జిల్లా కార్యవర్గ సభ్యులు హుజూర్ నగర్ టీ ఎస్ జె ఏ గౌరవ అధ్యక్షులు చిలక సైదయ్య పిడమర్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: