Tuesday, 15 September 2026 09:58:27 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

పెళ్లి చేయలేదని తండ్రిని చంపిన కొడుకు...

Date : 22 October 2024 10:25 AM Views : 787

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : నిజామాబాద్‌ జిల్లా, నవీపేట్‌ మండలం అనంతగిరికి చెందిన మహిపాల్‌ తన తండ్రి గౌరు అమృతాన్ని గొంతు నులిమి చంపేశాడు. ఆ తర్వాత సహజమరణంగా నమ్మించే ప్రయత్నం చేసి దొరికిపోయాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా కథ అడ్డం తిరిగింది. రంగంలోకి దిగిన పోలీసులు మహిపాల్‌ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు.. పూర్తి వివరాల్లోకి వెళితే..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతర గిరి గ్రామానికి చెందిన గౌరు అమృతం కుమారుడు గౌరు మహిపాల్‌ గత కొంతకాలంగా దుబాయ్‌లో ఉంటున్నాడు.. ఇటీవలే దుబాయి నుంచి స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. మహిపాల్‌ ఇంటికి వచ్చేసరికి తన తల్లి తండ్రి నుంచి విడిపోయి దూరంగా ఉంటోందని తెలిసింది. ఈ క్రమంలోనే తన తండ్రి అమృతం తన పశువులను కూడా అమ్ముకున్నాడని తెలిసింది. తల్లిని వేరుగా ఉంచడం, తనకు పెళ్లి చేయకపోవడం, పశువులు అమ్ముకోవడంతో తండ్రిపై మహిపాల్‌ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఇలాంటి తండ్రి లేకపోవటమే మంచిదని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి తండ్రీకొడుకులు మద్యం సేవించారు. అమృతం మత్తులోకి జారుకోవడంతో అతడి గొంతుకు టవల్‌ బిగించి హత్య చేశాడు... ఇక ఆ మర్నాడు ఉదయం స్థానిక డాక్టర్‌ని పిలిపించి తన తండ్రి లేవడం లేదని చూపించాడు..అమృతాన్ని పరీక్షించిన డాక్టర్‌ అతను చనిపోయినట్లుగా ధ్రువీకరించాడు. అమృతానిది సహజ మరణంగా చిత్రీకరించిన మహిపాల్‌ బంధువులకు సమాచారమిచ్చాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండగా అమృతం మెడపై గాయాలను గమనించిన బంధువులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తమదైన స్టైల్లో మహిపాల్‌ను విచారించగా తండ్రిని తానే చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడిని అరెస్టు చేసినట్టుగా నిజామాబాద్‌ నార్త్‌ రూరల్‌ సీఐ సతీశ్‌, ఎస్సై వినయ్‌ వెల్లడించారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: