సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : గ్రామస్థాయిలో ప్రోటోకాల్ పాటిస్తూ, ప్రజలకు నిబంధనలపై అవగాహన కల్పించాల్సిన పంచాయతీ కార్యదర్శి తిరుపతి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నర్సంపేట మండలం గురిజాల గ్రామంలో నిర్వహించిన గాంధీ జయంతి కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్వేత చెప్పులు ధరించే మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై గ్రామంలో చర్చ జరుగుతుంది. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన అధికారి ఇలా వ్యవహరించడం సరికాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై గ్రామ 3వ వార్డు సభ్యుడు సిరిపురపు మహేష్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆది నుంచి నిర్లక్ష్యమేనా? గురిజాల గ్రామ పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న శ్వేతపై గతంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నట్లు సమాచారం. గతంలో విధులు నిర్వహించిన పంచాయతీ కార్యదర్శి నుంచి అన్ని రిజిస్టర్లు, రికార్డులను పూర్తిస్థాయిలో స్వాధీనం చేసుకోలేదని అంశం ప్రస్తుతం చర్చనీయంశంగా మారింది. ఈ విషయంపై ప్రస్తుత కార్యదర్శి వివరణ కోరగా... గతంలో పనిచేసిన కార్యదర్శి నుంచి అన్ని రకాల రిజిస్టర్లు అందలేదని పేర్కొన్నట్లు సమాచారం. అయితే తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి అందుబాటులో ఉన్న రికార్డులను సక్రమంగా నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపినట్లు తెలిసింది. గత రికార్డులు, రిజిస్టర్లు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోయినా ప్రతి ఏడాది ఆడిట్ ప్రక్రియ ఎలా పూర్తవుతుందనీ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పంచాయతీ వ్యవహారాలను పర్యవేక్షించాల్సిన ఉన్నతాధికారుల తీరుపైన విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, తప్పిదాలు నిర్ధారణ అయితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
-----------------------
Reporter