Saturday, 18 April 2026 06:16:46 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

గురునానక్ విద్యా సంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలి... - ఏబీవీపి డిమాండ్

Date : 27 June 2023 12:57 AM Views : 375

సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఇబ్రహీంపట్నం : ఏబీవీపీ నాయకులు ఇబ్రహీంపట్నం, మార్కెట్ యార్డ్ లోని ఒక ప్రెవేట్ భవనం వద్ద ఏబీవీపి నాయకులు మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. మీడియా సమావేశం అనంతరం అక్కడికి చేరుకున్న పోలీసులు గురునానక్ కళాశాల వద్ద ఏబీవీపీ నాయకులు ధర్నా నిర్వహిస్తారు అన్న ఉద్దేశంతో నాయకులను అక్రమంగా అరెస్ట్ చేసి,ఇబ్రహీంపట్నం నుండి పహడిషరీప్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఇబ్రహీంపట్నం: యూనివర్సిటీ అనుమతులు పొంధకుందనే 4000 మందిని గురునానక్ యూనివర్సిటీ పేరుతో విద్యార్థుల అడ్మిషన్లు తీసుకొని విద్యార్థుల జీవితాలతో చెలగాటంఆడుతున్న గురునానక్ విద్యా సంస్థల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఏబీవీపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల.ఝాన్సి డిమాండ్ చేశారు.విద్యార్థులను గురునానక్ మోసం చేసిందంటు వారికి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.దీంతో భారీగా సమావేశం వద్ద భారీగా పోలీసులను మోహరించి అరెస్టు చేశారు.ఈ సందర్భంగా ఏబీవీపి నాయకులు మాట్లాడుతూ విద్యా ఉద్యోగాల కోసం కోట్లాది తెచ్చుకున్న తెలంగాణాలో విద్య వ్యాపారంగా మర్చడంలో భాగమే ప్రవేట్ యునివర్సిటీల అనుమతులన్నరు. గురునానక్ యూనివర్సిటీ అనుమతులు పోందకుంటనే విద్యార్థులను మోసం చేస్తూ అడ్మిషన్లు ఇచ్చిందని,గురునానక్ విద్యా సంస్థల అనుమతులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.అనుమతి లేకుండా ఉండవలసిన నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం యొక్క ప్రమేయంతో నడుస్తున్న గురునానక్ యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలి.యునివర్సిటీకి సహకరిస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ,ఏబీవీపీ పెట్టిన డిమాండ్స్ ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.అనుమతి లేకుండా అడ్మిషన్స్ తీసుకుంటున్న ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలి.ప్రైవేటు యూనివర్సిటీ హోదాకై ఎంక్వైరీ చేసిన కమిటీపై వెంటనే చర్యలు తీసుకోవాలి. నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు యూనివర్సిటీ హోదా కల్పించిన హయ్యర్ ఎడ్యుకేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. విద్యా వ్యవస్థను తప్పుదారి పట్టించి అసెంబ్లీలో ప్రైవేటు యూనివర్సిటీలను ప్రకటించిన అధికారి రాజీనామా చేయాలి. అర్హత లేని యూనివర్సిటీలో అడ్మిషన్స్ తీసుకున్న విద్యార్థులకు న్యాయం చేయాలి. యూనివర్సిటీ కి ఉండవలసిన నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు యూనివర్సిటీలను రద్దు చేయాలి.దీనిపైన గవర్నర్ ఎంక్వయిరీ జరిపించి నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన ప్రభుత్వ అధికారులు పెద్దలపైన యూనివర్సిటీ యాజమాన్యం పైన చర్యలు తీసుకోవాలి ని శాంతియుతంగా నిరసన చేపట్టిన ఏబీవీపీ నాయకులను అరెస్టు చేసి అక్రమంగా కేసులు బనాయించడం జరిగింది.ఏబీవీపీ హైదరాబాద్ సెక్రటరీ శ్రీకాంత్,వీరపట్నం జిల్లా కన్వీనర్ సాయి చరణ్,గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వంగ.సంజీవ రెడ్డి,ల ఫోరమ్ రాష్ట్ర కో కన్వీనర్ సాయి ధనరాజ్,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ కృష్ణ,సందీప్,జగదీష్,పవన్,శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :