సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : ట్రాఫిక్ నియమ నిబంధనలు విధిగా పాటించి తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ట్రాఫిక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. షాద్ నగర్ పట్టణ కేంద్రంలో సోమవారం బుగ్గ రెడ్డి గార్డెన్లో ప్రమాదాలను నివారించేందుకు 3 వీలర్, టు వీలర్ వాహనదారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ... ఈ మధ్య కాలంలో షాద్ నగర్ నియోజక వర్గం వ్యాప్తంగా పదుల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలతో మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో తల్లి తండ్రులకు శ్లోకాన్ని మిగిలిస్తున్నరని ఆవేదన వ్యక్తం చేశారు. వీటికి అడ్డుకట్ట వేసెందెందుకు కచ్చితంగా విధిగా ట్రాఫిక్ నియమా నిబంధనలు ద్వీచక్ర, ఫోర్ వీలర్, ప్రతి వాహనదారుడు పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెంట్ తప్పనిసరిగా పెట్టుకోవాలన్నారు. కార్లు నడిపించే వాహనదారులు సీట్‌బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు. ముఖ్యంగా మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. అలాగే మైనర్ల చేతికి వాహనాలు ఇవ్వరాదని తెలిపారు. ట్రాఫిక్, రోడ్డు భద్రతపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని కొన్ని కఠిన చట్టాల గురించి వివరించారు. చట్టాలను పాటిస్తూ తమ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా 800 మంది వాహనదార్లు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin