Thursday, 30 July 2026 11:20:33 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బిజెపి నేరేడుచర్ల బూత్ కమిటీ సమావేశం...

Date : 26 October 2023 06:11 AM Views : 277

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నేరేడుచర్ల పట్టణంలోని బిజెపి పార్టీ కార్యాలయంలో ఈ నెల 27వ తేదీన సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరగబోయేటటువంటి జన గర్జన బహిరంగ సభలో పాల్గొనేందుకు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా విచేయుచున్న సందర్భంగా వేలాది మంది తరలి వెళ్లాలని నేరేడుచర్ల పట్టణ మరియు మండల అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి, ప్రతిపాటి విజయ్ ల ఆధ్వర్యంలో నిర్వహించిన బూతు స్థాయి సమావేశంలో పాల్గొని బిజెపి కుటుంబ సభ్యులకు దిశా నిర్దేశం చేసిన హుజూర్ నగర్ నియోజకవర్గ బిజెపి నాయకురాలు చల్ల శ్రీలతరెడ్డి నేరేడుచర్ల పట్టణం నుండి పొదిల్ల అశోక్, నేరేడుచర్ల మండలం పెంచికల దీన్నే గ్రామం నుంచి యడవెల్లి సందీప్ లను బిజెపి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం చల్ల శ్రీలతరెడ్డి మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో గత తొమ్మిదిన్నర ఏళ్లుగా దోపిడీ పాలన కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క వర్గ ప్రజలకు సంపూర్ణ న్యాయం జరగడంలేదు. ప్రాజెక్టులను నాసిరకంగా నిర్మించి వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు.తెలంగాణలో నిరుద్యోగుల సమస్య తీవ్రంగా ఉంటే పరిష్కరించడానికి ఎలాంటి కృషి చేయడం లేదు.టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ల భర్తీ చేయడంలో పూర్తిగా విఫలం చెందింది. గ్రూప్స్ పేపర్లు లీక్ చేసి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది.తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో విచ్చలవిడిగా మద్యం బెల్టు షాపులను తెరిపించి, ప్రజల సమాధానం దోచుకుంటుంది. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపులను విచ్చలవిడిగా నడుపుతూ తెలంగాణలో తాగుబోతులను తయారు చేస్తుంది. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే, తెలంగాణలో మాత్రం సంక్షేమాల పేరిట దోపిడీ చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా, మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించాలన్న బిజెపి ప్రభుత్వం రావాలి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం అనేక పథకాలకు లక్షల కోట్లు నిధులు ఇస్తున్నా కూడా అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తుంది.సూర్యాపేట జిల్లాలో రైతాంగం ఎక్కువగా ఉన్నారని, సాగునీరు అందించడానికి కాలువలు నిర్మాణం జరగడంలేదు.తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బిజెపి ప్రభుత్వం రావాలి. డబుల్ సర్కార్ ఉంటే అభివృద్ధి మరింత వేగంగా ముందుకు దూసుకుపోతుంది. తెలంగాణ ప్రజలకు భరోసా కల్పించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 27న సూర్యాపేటలో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుంది. ఈ బహిరంగ సభకు మహిళలు, నిరుద్యోగులు, రైతులు ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలి. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కొణతం లచ్చిరెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొణతం నాగిరెడ్డి, శక్తి కేంద్ర ఇంచార్జులు, బూతు స్థాయి ఇంచార్జిలు బి జె పి నాయకులు ఊర్మిల రామ్మూర్తి, తాళ్ళ నరేందర్ రెడ్డి, జూలూరి అశోక్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :