Thursday, 30 July 2026 04:26:33 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

కుట్ర పురితంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు... -వాకిటి శ్రీహరి, డీసీసీ అధ్యక్షులు

Date : 01 April 2023 12:12 AM Views : 507

సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : దేశ ప్రధాని మోదీ చిరకాల మిత్రుడు ఆదాని యొక్క షెల్ కంపెనీలలో వేల కోట్ల రూపాయలు ఎలా వచ్చేయో తెలపాలని పార్లమెంట్ సాక్షిగా రాహూల్ గాంధీ ప్రశ్నిచడం వల్లనే మోడీ ప్రభుత్వం కుట్ర పూరితంగా అనర్హత వేటు వేసిందని నారాయణపేట డీసీసీ అధ్యక్షులు వాకిటి శ్రీహరి, మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి లు ధ్వజమెత్తారు. శుక్రవారం స్థానిక డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ లోక్ సభలో ఆదానీ, ప్రధాని మోదీ మధ్య ఉన్న సంబంధాన్ని ప్రశ్నిస్తూ ప్రసంగిచడం వల్లనే రాహుల్ గాంధీ పై కక్షపురితంగా వ్యవహరిస్తూ మోదీ ప్రభుత్వం అనర్హత వేటు వేసిందన్నారు. అప్పీల్ కోసం పై కోర్టు కు వెళ్లేందుకు నెల రోజులు కోర్టు గడువు ఇచ్చిన ఆగమేఘాల మీద రాహుల్ గాంధీ పై అనర్హత వేటు వేయడమే కాకుండా, ఇంటిని ఖాళీ చేయాలని నోటిసులు పంపడం మోడీ ప్రభుత్వం వికృత చేష్టలకు నిదర్శనమన్నారు. భారత్ జోడో యాత్ర ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకున్న రాహుల్ గాంధీ కి ప్రజల్లో వచ్చిన ఆదరణను చూసి ఓర్వలేకనే ఈ విధమైన చర్యలకు పాల్పడ్డారని వారు అన్నారు.2019లో కర్ణాటక లోని కోలార్ లో జరిగిన ఎన్నికల్లో భాగంగా రాహుల్ గాంధీ దొంగలను దొంగ అని ప్రసంగించారు.అందులో తప్పేముందో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మోదీ ప్రభుత్వం దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తుంటే వాటిపై ప్రశ్నిస్తున్నా రాహుల్ గాంధీ పై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పి కొడుతూ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా విడతల వారిగా నిరసన కార్యక్రమాలు చేపడతామని అయిన గాని మోదీ ప్రభుత్వం ప్రజావ్యతిరేక విధానాలను విడనాడక పోతే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో బ్లాక్ అధ్యక్షులు జి.సుధాకర్, శివకుమార్, మాజీ జడ్పి కో.ఆప్షన్ సభ్యుడు ఎండి.గౌస్,మండల అధ్యక్షులు సదాశివరెడ్డి, బాల్ రెడ్డి,యజ్ఞేశ్వర్ రెడ్డి,పేట పుర కౌన్సిలర్ ఎండి.సలీం, మక్తల్ పుర కౌన్సిలర్ నారాయణ, లిఖి రఘు,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహిముద్ ఖురేషి, ఎస్సి సెల్ జిల్లా అధ్యక్షులు బాలకిష్టయ్య యూసుఫ్ తాజ్, శ్రీనివాస్, హాసనుద్దీన్, లింగం, తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :