Tuesday, 15 September 2026 05:44:15 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ఇచ్చిన హామీలన్నీ కచ్చితంగా నెరవేరుస్తాం... -మంత్రి దనసరి అనసూయ సీతక్క

Date : 24 November 2024 11:54 AM Views : 589

సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : ప్రజాపాలన కళాయాత్ర ప్రభుత్వ కార్యక్రమాలపై విస్తృత ప్రచారం చేయాలని, ఇచ్చిన హామీలలో ఇప్పటికే ఐదు పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నామని, మరో రెండు గ్యారెంటీ త్వరలో అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు. జిల్లా పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలపై రెండు బృందాల కళాకారులు గ్రామాలలో ప్రజలకు ప్రభుత్వ వివరాలను తెలియజేస్తున్న సందర్భంగా శనివారం జిల్లా కేంద్రంలో కళాకారులు నిర్వహిస్తున్న కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అందజేత, పది లక్షల రూపాయల లోపు ఆరోగ్యశ్రీ పథకాలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని, మరో రెండు పథకాలు అయినా మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2500 రూపాయలు, పింఛన్ల పెంపు కార్యక్రమాన్ని త్వరలోనే అమలు చేస్తామని అన్నారు. గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో 21 లక్షల మంది రైతులకు 16 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయగా మేము అధికారంలోకి వచ్చిన పది నెలల కాలంలోనే 13 లక్షల మంది రైతులకు 18 వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేశామని, డిసెంబర్ 9వ తేదీ లోగా మిగిలిన రైతులకు రుణమాఫీ చేస్తామని అన్నారు. రైతులు పండించిన సన్న రకం వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ అందిస్తున్నామని, పది నెలల కాలంలోనే 53 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామని రానున్న వారం రోజుల్లో మరో తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని తెలిపారు. డీఎస్సీ ద్వారా ములుగు జిల్లాలో 195 మందిఉద్యోగాలు పొందారని అన్నారు. గ్రామాలలో ప్రభుత్వ పథకాల లబ్ధి పొందిన వారి వివరాలను సేకరించి ప్రజల ముందు ఉంచుతామని, కళాకారులు ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలకు వివరించాలని కోరారు. ప్రభుత్వంపై కొందరు కావాలని ఆరోపణలు చేస్తున్నారని గ్రామాల్లో ప్రభుత్వ పథకాలను పొందుతున్న వివరాలను వివరించాలని సీతక్క సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ బానోతు రవిచందర్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి ఎండి. రఫిక్, పలు శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, టిఎస్ఎస్ కళాకారులు,తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :