Wednesday, 29 July 2026 05:21:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

మూడో విడత అక్రిడిటేషన్ లను వెంటనే మంజూరు చేయాలి...

Date : 13 February 2023 11:50 PM Views : 678

సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన జర్నలిస్టులకు మూడో విడతలో అక్రిడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కు టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) ఆధ్వర్యంలో జర్నలిస్టుల బృందం వినతిపత్రం అందజేశారు. సోమవారం నూతన కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిసి అర్హులైన జర్నలిస్టులందరికీ మూడో విడతలో అక్రిడేషన్ కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ వి. పి. గౌతమ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ. అక్రిడేషన్ ల కోసం జర్నలిస్టులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, మూడో విడత అక్రిడిటేషన్లు వెంటనే మంజూరు చేయాలని కోరారు. యమ్ ప్యానల్ లిస్టులో ఉండి, గడచిన రెండు దఫాలలో అక్రిడేషన్లు రాకుండా మిగిలిన జర్నలిస్టులందరికి మూడో విడతలో కార్డులు మంజూరు చేసి జర్నలిస్టులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనికి కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ. త్వరలోనే అక్రిడిటేషన్ కమిటీని మరో మారు సమావేశపరిచి అర్హత కలిగిన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని, దీనికి సంబంధించిన విధి విధానాలను తయారుచేసి సిద్ధంగా ఉంచాలని అక్కడే ఉన్న డిపిఆర్ఓ గౌస్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి చిర్రా రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు(ఐజేయు)వెన్నబోయిన సాంబశివరావు, జిల్లా ఉపాధ్యక్షులు బొల్లం శ్రీనివాస్, టీఎస్ చక్రవర్తి, రాజేంద్రప్రసాద్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా అధ్యక్షులు వి రామకృష్ణ, సహాయ కార్యదర్శి షేక్ జానీ పాషా, ఖమ్మం ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, నగర అధ్యక్షులు బాలబత్తుల రాఘవ, నగర ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష కార్యదర్శులు యలమందల జగదీష్, కరీష అశోక్, మహిళా ప్రతినిధి వంగూరు ఈశ్వరి, నాయకులు వడ్డే రామారావు, మోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :