Thursday, 30 July 2026 07:48:39 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేయాలి... ఎంపిటిసి మీసాల ఉపేందర్

Date : 21 June 2023 01:50 AM Views : 448

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంలో డిజిటల్ బోధన చేస్తున్నందున ప్రజలందరూ విద్యార్థిని విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలకు పంపించి వాటి బలోపేతానికి సహకరించాలని పాలకవీడు ఎంపిటిసి మీసాల ఉపేందర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం నాడు జరిగిన విద్యా దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలోనే అర్హత సాధించినటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉంటారని, వీరికి సిలబస్ ప్లానింగ్ కరికులం ప్లానింగ్ తో పాటు ప్రతి పిల్లవాడికి అర్థమయ్యేలా బోధించేటటువంటి ప్రావీణ్యతను కలిగి ఉంటారని కనుక ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలలే ఉత్తమ ఫలితాలు సాధించి చరిత్రను సృష్టిస్తున్నాయని, ప్రభుత్వ పాఠశాలల నుండి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తున్నారని, కేవలం ప్రభుత్వ పాఠశాలలో చదివి పదో తరగతి ప్రతిభ కనబరిచిన వారు బాసర ఐఐఐటి లో సీట్ పొంది ఆరు సంవత్సరాల తరువాత ఇంజనీరింగ్ పట్టభద్రులు గా వచ్చే అవకాశం ఉంటుంది అని తెలిపారు.అనంతరం బాలికలు కోలాట నృత్యం చేస్తూ ర్యాలీ నిర్వహించి, కళవేదిక పై చూడముచ్చటగా కోలాట నృత్యం చేశారు.అనంతరం ప్రధానోపాధ్యాయులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బైరెడ్డి జితేందర్ రెడ్డి,ఉపాధ్యాయిని, ఉపాద్యాయులు ఉపేందర్, వెంకటరెడ్డి,సైదులు,స్వప్న,శ్రీనివాస్,రాములు,అనంతరెడ్డి, రామాంజనేయులు,సంధ్యరాణి, రేష్మా సిఆర్పి మంగ్తా నాయక్,తల్లిదండ్రులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :