సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తి నియోజకవర్గం పుట్టపర్తి మున్సిపాలిటీ పరిధిలో సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా దుర్గమ్మ గుడి దగ్గర ముగ్గుల పోటీలు నిర్వహించిన శ్రీ సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ అనంతరం అలాగే మాట్లాడుతూ.. కలియుగ ప్రత్యక్ష దైవం భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య ఆశీస్సులతో హిందూ సాంప్రదాయ ప్రకారం సంక్రాంతి పండుగ స్వచ్ఛమైన తెలుగుదనాన్ని తెలిపే పండుగ సంక్రాంతి అని తెలిపారు. అనంతరం నిర్వహించిన రంగవళ్లు పోటీలు ఆకట్టుకున్నాయి. విజేతలకు సామకోటి ఆదినారాయణ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.పోటీలు నిర్వహించి దాదాపు 55 మంది సభ్యురాలు వారి పేర్లు నమోదు చేసుకుని పెద్ద సంఖ్యలో పాల్గొని విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు ప్రతి తెలుగింటి ఆడపడుచులకు చీరలతో పాటు బహుమతులు అందజేశారు.అలాగే మొదటి బహుమతిగా గ్రైండర్‌ను శోభారాణి అందుకున్నారు. రెండవ బహుమతిగా మిక్సీ ధరణి, మూడవ బహుమతిగా గ్యాస్ స్టవ్ సాయి లక్ష్మి అందుకున్నారు. ముగ్గులపోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళలకు కన్సోలేషన్ సారీస్ బహుమతిగా అందించారు. ముగ్గుల పోటీలకు న్యాయ నిర్ణేతలుగా వాణి ,మాధవి ,వ్యవహరించారు. అలాగే ప్రింటర్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి శ్రీ సత్య సాయి జిల్లా ప్రజలకు సంక్రాంతి పండుగ పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యమ్రంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రాజగోపాల్ నాయుడు,రామ్మోహన్ నాయుడు, శామీర్ భాష,బేకరీ నాయుడు,యశ్వంత్,వెంకట్రాముడు,హరి,సూర్య వర్ధన్,మహబూబ్ బాషా,నజీర్ భాష తదితరులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు....
-----------------------
Admin