సర్కార్ టీవీ న్యూస్ / ములుగు జిల్లా : యువ సాహిత్య రత్న, ప్రముఖ సామజిక రచయిత కడియాల సురేష్ కుమార్ రాసిన ఆదివాసుల ఆత్మ బంధువు సీతక్క పుస్తకాన్ని ప్రజా భవన్ లో ఆవిష్కరించిన మంత్రి సీతక్క.. తన జీవిత చరిత్రపై పుస్తకం రాసిన రచయిత సురేష్ కుమార్ ను అభినందించిన మంత్రి సీతక్క. స్వశక్తితో ఎదిగిన ములుగు ప్రాంత వాసి సురేష్ మంచి రచయితగా గుర్తింపు పొందాలని ఆకాంక్షించిన సీతక్క.ఆయనను శాలువాతో సన్మానించారు, రచయిత సురేష్ కుమార్ ఆమె జీవితం,ఉద్యమం,పోరాటాలు గురించి అనేక వివరాలు సేకరించి ఈ పుస్తకం లో పొందుపరచారు ఈ పుస్తకానికి లోకసత్తా వ్యవస్థాపకులు డా జయ ప్రకాష్ నారాయణ్,ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కాశీమ్ మరియు బీఎస్ రాములు ముందుమాట రాసారు.. ఈ కార్యక్రమం లో బీసీ సంక్షేమ సంగం మహిళా నాయకురాలు మాహియా రాజ్, సుష్మ కుమారి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin