సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో భూ సమస్యలపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు ఆదేశించారు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లతో కలిసి పాల్గొని ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవి దృష్ట్యా గ్రామాలు పట్టణాలలో నేటి ఎద్దడి రాకుండా సంబంధిత అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని సూచించారు ముఖ్యంగా గ్రామాలలో జాబ్ కార్డ్ కలిగి ఉన్న కూలీలకు ఉపాధి హామీ పథకం ద్వారా ఉపాధి పనులు కల్పించాలని సూచించారు. ప్రజా పాలన సేవా కేంద్రాలలో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ వేగవంతం చేయాలని ఆ దిశగా ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు .రాబోయే లోక్సభ ఎన్నికల నేపథ్యంలో సిప్ కార్యక్రమాలు నియోజకవర్గాల వారీగా చేపట్టాలని గత శాసనసభ ఎన్నికల్లో నియమించిన నోడల్ అధికారులు సెక్టార్ అధికారులు ఎంతో నీ భద్రతతో పనిచేశారని లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే తరహా అధికారులు తమకు కేటాయించే విధులను సమర్ధవంతంగా చేయబట్టాలని ఆకాంక్షించారు జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ప్రజావాణిలో వివిధ భూ సమస్యలపై 92 దరఖాస్తులు అందాయని ఇతర శాఖల నుండి 39 కలిపి మొత్తం 131 దరఖాస్తులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో అప్పారావు, ఆర్డీవో మధుసూదన్ రాజు, డి.ఎఫ్.ఓ సతీష్ కుమార్, డిపిఓ సురేష్ కుమార్, డీఈవో శ్రీధర్ రెడ్డి ,వివిధ శాఖల అర్జీ అధికారులు తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin