సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ : రిటైర్డ్ హెడ్ మాస్టర్ శ్రీ వంగవీటి హనుమంతరావు మృతి బాధాకరమని హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజుర్ నగర్ పట్టణంకి చెందిన బీఆర్ఎస్ నాయకులు వంగవీటి సతీష్ తండ్రి హుజుర్ నగర్ అవోప అధ్యక్షుడు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ వంగవీటి హనుమంతరావు సారు అకస్మాత్తుగా గుండె పోటు రావడంతో మృతిచెందినారు. వారి నివాసానికి వెళ్లి, వారి పార్థివ దేహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ, అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపి,ఓదార్చారు వారికి మనోధైర్యం కల్పించారు.ఈ సందర్భంగా ఆయన వెంట ప్రజా ప్రతినిధులు, పట్టణ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin