Friday, 19 June 2026 03:39:27 PM
# గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక... # ఉగ్రవాదుల చెరలో భువనగిరి యువకుడు... # ఇది లేడీ కాదు..! కిలాడి..?

అక్రమ ఫైనాన్స్ , అనధికార చిట్స్ నిర్వహిస్తున్న వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించాలి..ఏఐవైఎఫ్ షేక్ జహుర్

Date : 13 May 2025 04:51 PM Views : 766

తెలంగాణ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అక్రమ ఫైనాన్స్ , అనధికార చిట్స్ నిర్వహిస్తున్న వ్యాపారస్తుల ఇళ్లలో పోలీసులు సోదాలు నిర్వహించాలి.... -ఏఐవైఎఫ్ షేక్ జహుర్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపాడు మండల పరిధిలో గల పలు ప్రాంతాలలో చీటి, డైలీ ఫైనాన్స్, గిరిగిరి వ్యాపారస్తుల ఆగడాలకు హద్దు అదుపు లేకుండా పోతుందని ఏఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు షేక్ జహుర్ అన్నారు. చట్టానికి విరుద్ధంగా నడిపించే ఈ ప్రైవేట్ చీటి పాటలు, ఫైనాన్స్ మరియు గిరిగిరి వ్యాపారస్తులు సామాన్య ప్రజల అవసరాలను సొమ్ము చేసుకుంటున్నారు. సామాన్య ప్రజలను నానా ఇబ్బందులు పెడుతూ పీడిస్తూ వారి వద్ద నుండి సొమ్ము రాయని కాల్లి చెక్కులు, ప్రాంసరీ నోట్లు మరియు బాండ్ పేపర్లు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నారు. సామాన్య ప్రజల నుండి అధిక వడ్డీలు వసూలు చేస్తూ వారిపై దాడులకు పాల్పడుతున్నారు. చెల్లించవలసిన సొమ్ము చెల్లించినప్పటికీ ప్రాంసరీ నోట్లు, సొమ్ము రాయని చెక్కులు, ఇచ్చేటప్పుడు ప్రజలను పిడిస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. డబ్బులు చెల్లించే విషయంలో కొంత ఎక్కువ సమయం పట్టిన వారి ఇళ్లకు వెళ్లి దుర్భాసలాడుతూ ఇళ్లల్లో నుంచి బయటకి లాగి వారిని మానసికంగా ఆత్మహత్యలు చేసుకునేదాకా చేసి వారి సొమ్మును రాబట్టుకోవడం వీళ్ళ ఎజెండా గా మారింది. సొమ్ము చెల్లించిన తర్వాత మా చెక్కులు, ప్రాంసరీ నోట్లు ఇవ్వమంటే ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ దురుసు మాటలు మాట్లాడుతున్నారు. చేసేదేమీ లేక పీడిత జనాలు బెంబోలెత్తిపోతున్నారు. గతంలో ఎస్పి రంగనాథ్ వారి ఆధ్వర్యంలో బూర్గంపాడు మండల పరిధిలో ఏకకాలంలో చట్టానికి విరుద్ధంగా ఫైనాన్స్ నడిపిస్తున్న వారి ఇళ్లపై సోదాలు నిర్వహించగా వారి దగ్గర నుండి అనేక ప్రాంసరీ నోట్లు, బాండ్ పేపర్లు, నగదు రాయకుండా సంతకం చేపించుకున్న చెక్కులు, ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నారు. దాని తరువాత మండల గ్రామాలలో వడ్డీ వ్యాపారం కొంత తగ్గు ముఖం పట్టింది. మరలా అడిగే నాథుడు లేక మండలంలో వడ్డీ వ్యాపారానికి హద్దు అదుపు లేకుండా పోతుందని చట్టానికి విరుద్ధంగా వ్యాపారం చేస్తున్నఇటువంటి వారిపై పోలీసు అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకొని పీడిత ప్రజలు ఆత్మహత్యలు చేసుకోకుండా కాపాడాలని కోరుతున్నట్లు తెలియజేశారు .

-----------------------

రాయల్ నవీన్

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: