తెలంగాణ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం, గంగదేవిపాడు గ్రామం లో బంజారాగిరిజనులు, హర్షం వ్యక్తం చేస్తూ బంజారా సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పూలు,పాలాభిషేకం ను బంజా రగిరిజన మహిళలు చేశారు. గిరిజనులపై చిత్తశుద్ధితో వారికి 10 శాతం రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పంపినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంద ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం, గంగదేవిపాడు గ్రామంలో బంజారా,గిరిజన మహిళలలు వారి సాంప్రదాయ బంజారా వేషధారణ, నృత్యాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులపై చిత్తశుద్ధితో ఈనెల 17వ తేదీన సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవంగా గిరిజన రిజర్వేషన్ పై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపినప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దానిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుంద ని విమర్శించారు. గిరిజనుల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు లేకపోయినా 10 శాతం రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దానిని తొక్కి పడుతుందని ఆయన ఆరోపించారు
-----------------------
Admin