ఆంధ్రప్రదేశ్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబులదేవర చెరువు మండలం లోని డబులు వారి పల్లి, మమిల్లకుంట్లపల్లి , ఓబులదేవర చెరువు గ్రామాల లో పంటలను పరిశీలించడానికి , కదిరి వ్యవసాయ పరిశోధన స్థానం నుండి డా. కే వేమన , ప్రధాన శర్స్త్రవేత (తెగుళ్ల విభాగం) ఎస్. నీలిమ శాస్త్రవేత్త వచ్చారు. పంటలను పరిశీలించి రైతులకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ముఖ్యముగా sunflower, వేరుసెనగ ,టొమాటో, పంటలను పరిశీలించి చీడ పీడలు,వాటి నివారణకు తగు చర్యలు తెలియపరీచారు. వేరు శనగ లో కలుపు ప్రధాన సమస్య గా గుర్తించి వాటి నివరణకు గా ను స్టాంప్ అను మందు వేరుసెనగ వేసిన మరుసటి రోజు పిచికారి చేస్తే కలుపు సమస్య తగ్గుతుందని తెలియజేశారు. అలాగే sunflower లోని తెగుళ్ల నివారణకు కార్భండిజం, టొమాటో లో తెగుళ్ల నివారణకు రేవుస్ పిచికారి చేయాలని రైతులకు సూచించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ, షేక్ పర్వీన్ శామీర్ బాషా వైస్ ఎంపీపీ లక్ష్మీదేవి గారు సర్పంచ్ M. గోవింద్ , రాష్ట్ర మైనారిటీ అధ్యక్షులు టీ శామీర్ బాషా జెడ్పీటీసీ కే. దామోదర రెడ్డి , S D.అబ్దుల్ హుసేన్, జానీ బాషా, మండల వ్యవసాయధికారి షేక్ .ఇలియాస్ మహమ్మద్ , RBK సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin